ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి : ఎపి ప్రజా సంక్షేమ సమితి డిమాండ్

ప్రకాశం జిల్లా చీమకుర్తి లో గల స్థానిక ఏపీ ప్రజా సంక్షేమ సమితి కార్యాలయంలో ప్రజల సమస్యలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయబడినది.

ప్రధాన డిమాండ్లు:

  •  కూరగాయలు,నిత్యావసర సరుకుల ధరలను నియంత్రణకు చర్యలుచేపట్టాలి
  • మూతపడిన అన్న క్యాంటీన్లు పేద ప్రజల కోసం తక్షణమే తెరవాలి
  • ట్యాంకర్లు నీటి తో ప్రజా ధనాన్ని వృధా చేయక శాశ్విత మంచినీటి పధకానికి చర్యలు చేపట్టాలి

ఈ సందర్భముగా రాష్ట్ర నాయకులు తన్నీరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలు సామాన్య ప్రజానీకానికి అందనటువంటి పరిస్థితి కేజీ ఉల్లిపాయల కోసం కూలి పనులు మానేసి రోజంతా క్యూలో నిల్చుంటే కానీ కిలో ఉల్లిపాయ దొరకటం లేదు.వర్షాలు పడి నీరు సమృద్ధిగా ఉన్న ఈ రోజుల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి .ప్రజలు కూరగాయలు కొనుక్కొని తిరిగే పరిస్థితుల్లో లేదు.

అసలే సంక్షోభం లో నడుస్తున్న గ్రానైట్ ఫ్యాక్టరీలు పరిస్థితి ఈ విధంగా ఉండగా, గ్రానైట్ ఫ్యాక్టరీ కార్మికులుకు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ,దానికి తోడు పెరిగిన కూరగాయలు,నిత్యావసర సరుకుల ధరలు పెరగటం వలన కార్మికులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో గత ప్రభుత్వం లక్షల ఖర్చు చేసి నిర్మించి (5/-) ఐదు రూపాయలకే భోజనం పెట్టె అన్న క్యాంటీన్లు మూత పడిపోవటం వలన పేద ప్రజలు ఆటో కార్మికులు,రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ,తోపుడు బండ్లు వారు కడుపు మాడ్చుకుని పరిస్థితి దాపురించింది. హోటల్ భోజనం 80 ఖర్చు చేసి తినలేక (5/-) ఐదు రూపాయల భోజనం దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . వారి ఆక్రందన చుసిన ఏపీ ప్రజా సంక్షేమ సమితి ప్రభుత్వాన్ని తక్షణమే అన్న క్యాంటీన్లు మళ్ళీ తెరవాలని డిమాండ్ చేస్తుంది .

వర్షాలు పడి నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా నీటి ట్యాంకర్లు ద్వారా ఇంటింటికి నీటిని సరఫరా చేయటం వలన ప్రజల సొమ్ము వృధాగా అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్టోరేజ్ ట్యాంకులను నిర్మించి శాశ్విత మంచినీటీ సరఫరా చేసే లాగ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడమైనది .

ఈ కార్యక్రమంలో ఏపీ ప్రజా సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు కరుణాకర్ ప్రేమల ,ఉపాధ్యక్షులు సాపాటి నాగేశ్వర రావు,నాయకులూ రవి, కోటయ్య తదితరులు పాల్గొన్నారు .

0/Post a Comment/Comments

Previous Post Next Post