ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా లక్ష్మీపార్వతి

వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతికి ఏపీ సర్కారు కీలక పదవి అప్పగించింది. లక్ష్మీపార్వతిని ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యావంతురాలైన లక్ష్మీపార్వతి ఈ పదవికి న్యాయం చేస్తారని భావిస్తున్నారు. లక్ష్మీపార్వతి వైసీపీలో చేరిన తర్వాత సమయానుకూలంగా తన గళం వినిపిస్తూ పార్టీ వర్గాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె శ్రమకు తగిన ప్రతిఫలం ఇప్పుడు దక్కినట్టు తెలుస్తోంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post