టీడీపీ ఎమ్మెల్మీ నారా లోకేశ్ మరోసారి తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా విమర్శనాస్త్రాలు సంధించారు. నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నానని చెబుతున్న సీఎం జగన్, తన ఇంటి కిటికీల కోసం రూ.73 లక్షల మొత్తాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి పొందడం ఎంత మోసం! అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. “సరిగా వినండి, నేను మళ్లీ ఇదే విషయాన్ని రిపీట్ చేస్తున్నాను. జగన్ నివాసంలో కిటికీల ఏర్పాటుకు రూ.73 లక్షలు కేటాయించారు. అన్ బిలీవబుల్, మైండ్ పోతోంది…” అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా, తన ట్వీట్ లో దీనికి సంబంధించిన ఆదేశాల ప్రతిని కూడా పొందుపరిచారు.
https://twitter.com/naralokesh/status/1192052750747500545?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1192052750747500545&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-667382-telugu.html
Post a Comment