టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఉదయం సిద్ధిపేట సమీపంలో సంపూర్ణేశ్, తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, కొత్త బస్టాండ్ వద్ద ఓ ఆర్టీసీ బస్సు అతని కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారంతా గాయపడ్డారు. సంపూర్ణేశ్ ముఖానికి, చేతులకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఆయన భార్య, కుమార్తె కూడా గాయపడ్డారు. వీరిని చూసి స్పందించిన స్థానికులు, సమీపంలోని ఆసుపత్రికి తరలించడంలో సాయపడ్డారు.
ఈ ప్రమాదంపై సిద్ధిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సంపూర్ణేశ్ బాబు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సు తాత్కాలిక డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తులో డ్రైవింగ్ చేశాడా? అన్న విషయంపై పోలీసులు ఆరా తీశారు. డ్రైవర్ కు బ్రెత్ ఎనలైజర్ తో పరీక్ష చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Post a Comment