ఎస్పీజీ చట్టాన్ని గత ప్రభుత్వాలు నీరుగార్చాయని హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ చట్టం అసలు ఉద్దేశాన్ని తమ ప్రభుత్వం పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. 1988లో ఈ బిల్లును తీసుకొచ్చినప్పటినుంచి ప్రభుత్వాలు చట్టాన్ని సవరిస్తూ.. దాని అసలు లక్ష్యాన్ని నిర్వీర్యం చేశాయని పేర్కొన్నారు. ఇక ముందు ప్రధానితో పాటు ఆయన అధికారిక నివాసంలో ఉండే కుటుంబానికి మాత్రమే ఎస్పీజీ రక్షణ కల్పించబడుతుందని అన్నారు. అదేవిధంగా మాజీ ప్రధానితోపాటు ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసంలో ఉండే వారి కుటుంబ సభ్యులకు ఐదేళ్ల కాలంపాటు ఎస్పీజీ భద్రతను కల్పిస్తామని తెలిపారు. గాంధీ కుటుంబ సభ్యులైన సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలకు గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఎస్పీజీ భద్రతను ఇటీవల కేంద్రం తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చట్ట సవరణకుద్దేశించిన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు.
Post a Comment