కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎంపీడీవో ఆఫీసు సమీపంలో రహదారిపై బెజ్జంకి నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి టీవీఎస్ ఎక్సెల్ పై వెళ్తున్న సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లికి చెందిన ఉప్పు రాములు, వయస్సు: 53 వెనకనుండి ఢీకొట్టగా… తలకు తీవ్రమైన గాయాలై మృతి చెందాడు. ఎల్ఎండీ పొలీసులు HKR వారి అంబులెన్స్ లొ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. హెల్మెట్ టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై ఉండి తలకు ధరించకపొవడం వలన తలకు తీవ్ర రక్త గాయాలై మృతుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి…
పోలీస్ వారు హెల్మెట్ ధరించాలని పదే పదే చెబుతున్నా కొంతమంది లెక్కచేయకుండా తెలిసీ తెలియక తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. దయచేసి హెల్మెట్ ధరించండి.. అది మీ ప్రాణాలను కాపాడడమే కాకుండా మీ కుటుంభాలను నిలబెడుతుంది.
Post a Comment