శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సాధుపరిషత్ హిందూ సమ్మేళనంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పలువురు హిందూ స్వామీజీలు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఏపీ సాధుపరిషత్ హిందూ సమ్మేళనానికి పలువురు స్వామీజీలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ, హిందువులు కష్టపడి చెల్లిస్తున్న కోట్లాది రూపాయల పన్నుల నుంచి వైసీపీ ప్రభుత్వం పాస్టర్లకు, ఇమామ్ లకు నెలకు రూ. 5 వేలు దోచిపెట్టేందుకు సిద్ధమవుతోందని మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
Post a Comment