టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చిక్కుల్లో పడ్డారు. గంటా పార్టీ మారుతున్నట్టు కొన్నిరోజులుగా కథనాలు వస్తున్నాయి. అయితే, ఆయనకు సంబంధించిన ఆస్తులను వేలం వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇండియన్ బ్యాంక్ నుంచి గంటా ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రూ.209 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ అప్పు నిమిత్తం రూ.35 కోట్ల విలువైన ఆస్తులు తనఖా పెట్టినా మిగిలిన బకాయిల కోసం బ్యాంకు గంటా ఆస్తుల వేలానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. రికవరీ కోసం వ్యక్తిగత ఆస్తులు స్వాధీనం చేసుకునే హక్కు బ్యాంకుకు ఉందని బ్యాంకు అధికారులు అంటున్నారు. డిసెంబరు 20న ఆయన ఆస్తుల వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్టు సమాచారం.
Post a Comment