ఎపి – నెల్లూరులో ఆత్మహత్యకు పాల్పడ్డ టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా వార్తలు రాసే మీడియాపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సర్కార్ ఇటీవల జారీ చేసిన జీవో విషయమై మాట్లాడుతూ, ఆ జీవోను రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేసిందని, ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని, తమ ప్రజాప్రతినిధులపై, కార్యకర్తలపై, మీడియా పైనా దొంగ కేసులు పెట్టారని, రేపు కొత్త చట్టం తీసుకొచ్చి జడ్జిల పై కూడా తప్పుడు కేసులు పెట్డండని సీఎం జగన్ చెప్పే పరిస్థితికి వచ్చారని తీవ్ర విమర్శలు చేశారు. యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే కాకుండా బయటకొచ్చి పోరాడాలని లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు . రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయాలని ఈ ప్రభుత్వం చూస్తోందని వైసిపి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.
Post a Comment