సామర్లకోట (పెద్దాపురం): అమ్మాయిని ఎరగా వేసి . కొంతమందిని ప్రలోభ పెట్టి బ్లాక్ మెయల్ చేస్తూ డబ్బులు లాగుతూ మోసాలకు పాలుపడుతున్న ఓ గ్యాంగ్ ను సామర్లకోట క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనేక మంది ఇటువంటి ఊబిలో చిక్కుకున్నా, కొంతమంది బయటకు చెప్పుకోలేక కాసులు చెల్లించి సైడ్ అయినట్టు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు సామర్లకోట పోలీసు స్టేషన్‌లో పెద్దాపురం సీఐ వి. శ్రీనివాసు శుక్రవారం విలేకర్లకు వెల్లడించారు జి.మామిడాడలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న తాడి కేదారమణికంఠరెడ్డి, కాకినాడలో జై ఆంధ్రా ఛానల్ నడుపుతున్న తేతలి దుర్గారెడ్డి మధ్య స్థలం వివాదం ఏర్పడింది. దీంతో దుర్గారెడ్డి తన చానల్‌లో పని చేస్తున్న రాకేష్‌తో భార్యాభర్తలైన మహేష్, అశ్వినిల సహకారం తీసుకొని కేదారమణికంఠరెడ్డిని మడికి అశోక్ అనే వ్యక్తి ఇంటికి వచ్చేలా ఈనెల ఏడో తేదీన ఏర్పాటు చేశారు. కేదారమణికంఠరెడ్డి, అశ్వినిలు గదిలోకి వెళ్లిన వెంటనే బ్లాక్‌మెయిల్ ముఠా సభ్యులు అసభ్య వీడియోలను చిత్రీకరించి బెదిరించారు. అప్పటికీ అతడు లొంగకపోవడంతో కట్టిపడేసి చిత్ర హింసలకు గురిచేశారని సీఐ తెలిపారు. రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా రూ. 50వేలకు ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఈ క్రమంలో కేదారమణికంఠరెడ్డి వద్ద ఉన్న రూ।63 వేల నగదు, అతడి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, తెల్లకాగితాలు , ప్రామిశరీ నోట్లు పై సంతకాలు, వేలి ముద్రలు వేయించుకొని పరారయ్యారని, బాధితుడు తాడి కేదారమణికంఠరెడ్డి ఈనెల 8వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈనెల 14న ఇంద్రపాలెంలో ఒక ఇంటిలో ఉన్న ఆరుగుళ్ల మహేష్, భూరి అశ్విని, నిమ్మకాయల సతీష్, తోట సందీప్, బొడ్డుపు రాజేష్‌కుమార్, ఎలుడుట్టి లక్ష్మీనారాయణ, మడికి అశోక్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరాన్ని అంగీకరించినట్టు తెలిపారు. ఏ1 దుర్గారెడ్డి, రాకేష్ పరారీలో ఉన్నారని తెలిపారు. వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో ఎస్సై సుమంత్, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు లో కూడ ఇటువంటి ముఠాలు ఉన్నట్టు సమాచారం , కానీ ఎందరో బాధితులు ఉన్నప్పటికీ బయటికి రాణి పరిస్థితి , త్వరలో అప్రమత్తమై హైదరాబాద్ పోలీసువారు కూడా ఇటువంటి గుట్టు రట్టు చేయాలనీ కోరుకుందాం.
Post a Comment