ఎపి సర్కారు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్‌కు షాకిచ్చింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వొద్దంటూ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ తమ రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని ఏపీ ప్రభత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించొద్దని విజ్ఞప్తి చేసింది.
విభజన హామీల అమలులో జాప్యం జరుగుతోందని బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రీ-ఇంజినీరింగ్ పేరిట తెలంగాణ సర్కారు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చింది। ఈ ప్రాజెక్ట్ ద్వారా 225 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోందని, కాళేశ్వరం పూర్తిగా కొత్త ప్రాజెక్ట్ అని, అనేక అభ్యంతరాలు వ్యక్తమైనా, కేంద్ర జల సంఘం 2018 జూన్‌లో దీనికి అనుమతులు ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ వాదిస్తోంది. పోలవరంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ పైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని।। ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపారని తెలిపింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ సర్కారు కేంద్రంపై ఒత్తిడి తెస్తోన్న వేళ, ఎపి ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడం , నెల రోజుల్లో కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం తీసుకున్న రెండో నిర్ణయం ఇది కావడం విశేషం .
Post a Comment