బెజ్జంకి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోమాత పూజలు



 ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిద్ధిపేట జిల్లా మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆషాఢ అమవాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక సత్యసాయి గురుకుల్ విద్యాలయంలో  గోమాత పూజ నిర్వహించారు. అనంతరం ఆవులకు దాణా , పండ్లు, బెల్లం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ లోని సభ్యులు పాల్గొని ఆవులకు దాణా ను అందించారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి లయన్స్ క్లబ్  అధ్యక్షుడు మోహన్ రెడ్డి, సెక్రటరీ వై రవీంద్ర ప్రసాద్, డిస్ట్రిక్ట్ చీఫ్ కో ఆర్డినేటర్ లు నారేడ్డి సుదర్శన్ రెడ్డి, పుళ్లూరి ప్రభాకర్, నిమ్మ మహేందర్ రెడ్డి, బద్దం మల్లారెడ్డి, ఆర్పీ భరత్ తదితరులు పాల్గొన్నారు



0/Post a Comment/Comments

Previous Post Next Post