కరీంనగర్ జిల్లా: టీపీసీసీ పిలుపు మేరకు పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలను నిరసిస్తూ ఈ నెల 12న కరీంనగర్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఉదయం 10గంటలకు ఇందిరా భవన్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు సైకిల్ ర్యాలీగా వెళ్లి అనంతరం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది కావున జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇంచార్జిలు, రాష్ట్ర, జిల్లా కమిటీల నాయకులు, మండల,పట్టణ,గ్రామ కమిటీల అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు
కార్యక్రమంలో నగర అధ్యక్షులు నరేందర్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రహమత్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు గుండాటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం విలాస్ రెడ్డి,మామిడి అనిల్ తదితరులు పాల్గొన్నారు
Post a Comment