ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది : ఎర్రబెల్లి దయాకర్ రావు



 ప్రైవేటు విద్యా వసతులకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయితీ రాజ్, రూరల్ అభివృద్ధి శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.  

మంగళవారం కోరుట్ల నియోజక వర్గంలో 2 కోట్ల 6 లక్షల 50 వేలతో మాదాపూర్ నుండి కట్లకుంట వయా చిన్నమెట్పల్లి మీదుగా 3.75 కి.మి బిటి రోడ్డు, 3కోట్ల 90 లక్షలతో మాదాపూర్ నుండి కట్లకుంట వయా చిన్నమెట్పల్లి మీదుగా 10.37 మీటర్లతో నిర్మించిన బ్రిడ్జి, మరియు 4.16 కి.మి  పోడవుతో 2 కొట్ల 30 లక్షల 20 వేల వ్యయంతో నిర్మించిన వెల్లుల నుండి కొండ్రికల్ వయా మాసాయిపేట  వరకు గల రోడ్డు మార్గానికి, 6 కోట్ల 42 లక్షల 30వేలతో 8.15 కి.మి పొడవున బండలింగాపూర్ X రోడ్దు నుండి ఆత్మకూర్ వయా జగ్గాసాగర్ వరకు నిర్మించిన రోడ్డుకు, 3 కోట్ల 83 లక్షల 40వేలతో ఇబ్రహీంపట్నం నుండి నడికుడ వయా యామాపూర్, ఫకీర్ కొండాపూర్ గ్రామం వరకు 6.99 కి.మి పొడవుతో నిర్మించిన రోడ్డు మార్గాలకు శంకుస్థాపనలు, కోరుట్ల మండలం సంగెం గ్రామంలో, 33/11 కె.వి  విద్యూత్ సబ్ స్టేషన్, సంగెం, వెల్లుల, మెట్లచిట్టాపూర్ మరియు చౌలమద్ది గ్రామాలలో 22లక్షల వ్యయంతో నిర్మించిన ఒక్కొ రైతువేధికను, వెల్లుల పల్లెప్రకృతి వనాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖా మాత్యులతో కలిసి ప్రారంబించారు.   

ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుతూ, పల్లె ప్రగతి కార్యక్రమాల ప్రగతిపై దృష్టిసారించి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ప్రధాన ఉద్దేశ్యం అనేక  రోజులుగా నిర్లక్ష్యానికి గురై సరైన వసతులు లేని గ్రామాలను బాగు చెయాలనేదే పల్లే ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమమని అన్నారు. పెరుకుపోయిన సమస్యలను పరిష్కించేదిశగా, గ్రామాలు, పట్టణాలలో ఉండాల్సి మౌళిక సదుపాయలను కల్పించే దిశగా ప్రగతి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని గ్రామంలో చెత్తను తొలగించడానికి, ట్రాక్టర్, ప్రతి ఇంటిక మంచినీరు, చెట్లకు నీరుపోసుకోవడానికి ట్యాంకర్, చనిపోయిన వారికి గౌరవ ప్రదంగా దహన సంస్కరాలు జరిగేలా వైకుఠదామాలు, పల్లెప్రకృతి వనాల, విద్యూత్ సమస్యల పరిష్కారం, చెత్తాచెదారం లేకుండా చేయాలనే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.  పండించిన పంటకు కోనుగోలు కేంద్రాల ద్వారా అమ్మిన వెంటనే డబ్బులు బ్యాంకుఖాతాలలో జమచెయడం జరిగుతుందని అన్నారు. దేశంలో వరిని ఘననీయంగా పండించిన రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్నామని అన్నారు. రానున్న రోజులలో ఉచితి, నాణ్యమైన విద్యా, ఉచిత వైద్యం అందించడంలో మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించే దిశగా అడుగులు వేయడం జరుగుతుందని పేర్కోన్నారు.  ఇప్పటికే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిచేసుకోని సమృద్దిగా నీటి నిలువలు సమకూర్చుకోవడం జరిగింది ప్రగతి కార్యక్రమాల అమలులో కూడా మొదటిస్థానం పొందామని అన్నారు. మొక్కబడిగా కాకుండా5లక్షల 5వేలతో డబుల్ బెడ్ రూం నిర్మాణాలకు కేటాయించడం జరిగిందని, ఇళ్లనిర్మాణాలు తలెత్తడంతో ఎవరి స్థలంలో వారే డబుల్ బెడ్ రూం కట్టుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ డబ్బులనకు కూడా వారి ఖాతాలోనే జమచేయడం జరుగుతుందని, ఆదిశగా బడ్టెట్ 11వేల కోట్లను మంజూరు చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. ప్రభుత్వ సహయం పొందని వారు ఒక్కరు కూడా లేకుండా ప్రభుత్వం అన్ని విధాల సహయాన్ని అందిస్తుందని పేర్కోన్నారు. 

99% ప్రభుత్వ ఆసుపత్రిలో సురక్షితంగా ప్రసవం చేయడంతో పాటు ఆడపిల్ల పుడితే 13వేలు, మగపిల్లలు పుడితే 12 వేలు ఇచ్చి 18 వస్తువులతో కేసిఆర్ కిట్ ఇచ్చి అంబులెన్స్ లో ఇంటికి తీసుకువెళ్లి దించడం జరుగుతుందని, ఓటరిమహిళలకు 80 వేల మందికి పించన్ ఇవ్వడం జరుగుతుందని పేర్కోన్నారు.   

57 సంవత్సరాలు నిండి, రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా వచ్చే నెల నుండి పించన్లను అందించేలా కృషి చేయడం జరుగుతుందని పేర్కోన్నారు. గ్రామ రూపురేఖలను మెట్లచిట్టాపూర్ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలిచిందని, ఒకప్పుడు నిజామాద్ జిల్లా  అంకాపూర్ గ్రామాన్ని చెప్పుకునే వారని, కాని ఇప్పుడు జిల్లాలో అనేక గ్రామాలు ఆదర్శ గ్రామాల వైపు పయనిస్తున్నాయని పేర్కోన్నారు.


ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత,  గ్రామ సర్పంచ్ గంగరాజు, యంపిపి తోట నారాయణ, జట్పిటిసి లావణ్య, యంపిటిసి  విజయ, రైతుసమన్వయ సమిత అద్యక్షులు , స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



0/Post a Comment/Comments

Previous Post Next Post