మేలైన రకాలు పండించి అధిక దిగుబడులు పొందిన రైతుకు సన్మానం చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్



 కరీంనగర్ జిల్లా  గన్నేరువరం మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయాన్ని  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  ప్రారంభించారు  మేలైన రకాలు పండించి అధిక దిగుబడులు పొందిన రైతు గన్నేరువరం గ్రామానికి చెందిన బొడ్డు బాలయ్య ను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సన్మానం చేయడం జరిగింది ఏవో కిరణ్మయి మాట్లాడుతూ.....

రైతు బొడ్డు బాలయ్య  ప్రత్యేకతలు. 72 సంవత్సరాల వయసులో కూడా యువరైతు లాగా  1) అధిక దిగుబడినిచ్చే కొత్త వేరుశనగ రకమైన లేపాక్షిని పండించి అధిక లాభాలు పొందారు. ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి తో లాభాలు పొందారు 2) బహువార్షికమైన కొలంబో కంది రకాన్ని పండించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందారు మరియు ది ఎస్ ఎన్ ఆర్ 736 అనే కంది హైబ్రిడ్ రకాన్ని సాగు చేసి ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి పొందారు 3)  అధిక పోషకాలు కల బ్లాక్ రైస్ ను పండించి కిలో బియ్యం రూ150 చొప్పున అమ్మి అధిక లాభాలు పొందారు.ఇలా మేలైన రకాలు సాగు చేస్తూ,అధిక దిగుబడి ఇచ్చే రకాలను ఎంచుకుంటూ, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ, రైతు లాభాలు పొందారని అన్నారు.



0/Post a Comment/Comments

Previous Post Next Post