బెజ్జంకి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రీ డయాబెటిక్ స్క్రీనింగ్ మరియు మెడికల్ క్యాంపు



 ఉమ్మడి కరీంనగర్ జిల్లా బెజ్జంకి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రీ డయాబెటిక్ స్క్రీనింగ్ మరియు మెడికల్ క్యాంపు నిర్వహించి 196 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవ చేసే అవకాశం రావడం దేవుడిచ్చిన వరమని, లయన్స్ క్లబ్ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలను రూపొందించి ప్రణాళిక బద్దంగా పని చేస్తామని, మీ అందరి సహకారం అందించాలని కోరారు. విధంగా వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ వైద్యులను సన్మానించి మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పల్లె ప్రగతి లో భాగంగా సాయిబాబా మందిరం లో మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్  అధ్యక్షుడు మోహన్ రెడ్డి  కార్యదర్శి వై రవీంద్ర ప్రసాద్, కోషాదికారి బండి వేణు, సీనియర్ లయన్ ఎన్ సుదర్శన్ రెడ్డి, ఎంపిపి లింగాల నిర్మల లక్ష్మణ్, సర్పంచ్ మంజుల శ్రీనివాస్, ఎంపిటిసి గుబీరే శారద మల్లేశం, వైద్యురాలు మౌనిక, వంగల నరేష్, ఎల్ శ్రీనివాస్, బి శ్రీనివాస్, అరుణ్, వినయ్, హర్ష లక్ష్మణ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.



0/Post a Comment/Comments

Previous Post Next Post