జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదుల దాడి - పలువురికి తీవ్ర గాయాలు

 


జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల బృందంపై గ్రనేడ్లు విసరడంతో ఏడుగురు సామాన్య పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. పుల్వామా జిల్లా త్రాల్‌ ప్రాంతంలోని మెయిన్‌ బస్‌ స్టాండ్‌ వద్ద ఉన్న పోలీసుల బృందంపై ముష్కరులు గ్రనేడ్లు విసిరారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ఏడుగురు సాధారణ పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.


సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు స్థానిక పోలీసులతో కలిసి ముష్కరుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. గత నెల 26న సైతం ఇదే తరహాలో ముష్కరులు త్రాల్‌ ప్రాంతంలోనే సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై గ్రనేడ్‌ విసిరారు. కానీ, ఈ ఘటనలో ఏ ఒక్కరికీ గాయాలు కాకపోవడం గమనార్హం.




0/Post a Comment/Comments

Previous Post Next Post