కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన వార్డు సభ్యుడు బుర్ర జనార్దన్ గౌడ్ (45)కరోనా బారినపడి శనివారం మృతి చెందాడు గత కొద్ది రోజులుగా కరోనా బారిన పడడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందగా పరిస్థితి విషమంగా మారడంతో శనివారం ఉదయం తుది శ్వాస విడిచాడు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి కుటుంబ సభ్యులు కరోనా నిబంధనలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు ప్రజాప్రతినిధులు ప్రజలు వార్డు సభ్యుడి అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు, వార్డు సభ్యుడు బుర్ర జనార్దన్ గౌడ్ లయన్స్ క్లబ్ లో వివిధ శాఖల్లో పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు, టిఆర్ఎస్ పార్టీలో చురుగ్గా పని చేశాడు, అతని మరణం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Post a Comment