కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్-42 వృతి రీత్యా కిరాణం దుకాణం నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు,తన యొక్క రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా దుకాణం నడుపుకోవడమే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా శనిగరం మండలంలో నివసిస్తున్న తన మిత్రుడైన బొడిగె స్వామి-38 తో కలిసి నిషేదిత గుట్కా ఊత్పత్తులను కరీంనగర్ జిల్లా పరిధిలో సరఫరా చేస్తూ అధిక డబ్బులను ఆర్జించాలనే ఊదేశ్యంతో వీరిద్దరూ గుట్కాలను తీసుకోని గుండ్లపల్లి చౌరస్తా వద్ద ఎదురుచూస్తున్న సమయంలో వీరి కదలికలపైనా అనుమానం వచ్చిన కరీంనగర్ టాస్క్ ఫోర్స్ మరియు గన్నేరువరం పోలీసులు వీరి వద్ద తనిఖీ చెయ్యగా డెబ్భై వేల రూపాయల నిషేదిత గుట్కా ఊత్పతులను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
వీరి వద్ద నుండి డెభై వేల రూపాయల గుట్కాలు ,రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది .పట్టుబడ్డ నిందితులను విచారణ నిమిత్తం గన్నేరువరం పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మల్లయ్య ,సృజన్ రెడ్డి , గన్నేరువారం ఎస్ఐ ఆవుల తిరుపతి , టాస్క్ ఫోర్స్ ఏఆర్ఎస్ఐ నర్సయ్య , టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు
Post a Comment