లాక్ డౌన్ సడలింపు సమయం విచ్చల విడిగా తిరగడానికి కాదు : కమిషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి



 ఒక వైపు  కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తూ కుటుంబాలకు కుటుంబాలను కబలిస్తూ ఉండగా, ఆ మహమ్మారి వ్యాప్తిని అరికట్టుటకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటూ, అందులో బాగంగా, లాక్ డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడకుండా ఉండడానికి  ప్రతిరోజు ఉదయం 6.00 గంటల నుండి 10.00 గంటల వరకు అనగా (4) గంటలు వెసులుబాటు కల్పించినది. 


ఈ సమయంలో ప్రజలు తమ నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం బయటకు వచ్చి తమకు అవసరం ఉన్న సరుకులను కొనుగోలు చేసుకొని వెళ్ళుటకు మాత్రమే ఉద్దేశించినది. 


కానీ కొంతమంది ఈ సమయంలో తమ బంధు మిత్రుల ఇళ్లకు వెళ్ళడానికి, చనిపోయిన వారిని పరామర్శించడానికి మరియు తమ పనులు చక్క బెట్టుకు కోడానికి వెళుతున్నారు. అంతేకాకుండా సడలింపు సమయంలో ఇతర గ్రామాలలో, పట్టణాలలో ఉన్న తమ కుటుంబ సభ్యులను బంధువులను కలవడానికి ప్రయాణాలు మరీ చేస్తున్నారు. 


ఇంకా కొందరు ఆదివారము రోజు ఉదయం 9-30 గంటలకు సంచీ పట్టుకుని బయలు దేరి పోయి చికెన్, మటన్ దుకాణాల ముందు అన్నీ మర్చిపోయి గుంపులుగా చేరి పోతున్నారు.


చికెన్ మటన్ ఇప్పుడు కాకపోతే మరోసారి తినొచ్చు.....కానీ ప్రాణం పోతే తిరిగి రాదు అనే విషయం గ్రహించక పోవడం దురదృష్టం.


మన నిర్లక్ష్యం వల్ల, మన అజాగ్రత్త వల్ల, మాకు ఏమీ కాదు అనే మూర్ఖత్వం వల్లనే మనం ప్రస్తుతం  అనుభవిస్తున్న పరిస్థితి అని గమనించ వలసినదిగా కోరుతున్నాం.


ఇలా లేని పోని సాకులతో బయటకు వచ్చి, రోడ్లపై కనిపించే వారి పట్ల పోలీస్ లు కటినంగా వ్యవహరిస్తూ, వారి వాహనాలను స్వాధీనం చేసుకుని కోర్టు లో డిపాజిట్ చేస్తామని తెలియ చేస్తున్నాము. ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై ఎపిడెమిక్ డిసీజెస్ చట్టం మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం క్రింద కేసులు నమోదు చేస్తామని తెలియ చేస్తున్నాము


కావున ప్రజలందరిని కోరేది ఏమనగా మీరు సమాజానికి మేలు చేయక పోయినా ఫర్వాలేదు....కానీ మీ కుటుంబాలకు నష్టం చేయకండి.


జాగ్రత తో, క్రమ శిక్షణ తో వుండండి - కరోనా మహామ్మరి నుండి కాపాడుకోండి !

0/Post a Comment/Comments

Previous Post Next Post