విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో రెండో విడత కో వ్యాక్సీనేషన్ పూర్తి



 విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో బోధన మరియు బోధనేతర సిబ్బందికి రెండో విడత కో వ్యాక్సీనేషన్ వేయడం జరిగింది.కార్యక్రమంలో భాగంగా రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ .విజయ కృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ రెండో విడత తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా కాసుమూరు PHS వైద్యులు సహకరంతోటి విశ్వవిద్యాలయ సిబ్బందికి 45 సంవత్సరాలు దాటిన ఉద్యోగులందరికి కూడా కో వ్యాక్సిన్ రెండో విడత రెండు డోస్ ఇప్పించండమైంది. అందుకోసం వైద్యులకి ,DMHO గారికి విశ్వవిద్యాలయం తరుపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాము.కోవిడ్ నేపద్యంలో వ్యాక్సినేషన్ మీద ఉన్న కొన్ని అపోహలు తగ్గినప్పటికి కూడా అపోహలు కొన్ని ఉన్నాయి ఇప్పటికీ దాని వల్ల ఏదో అవుతుందన్న కొంతమంది దాని వల్ల ఇబ్బంది అవుతుందనేది అటువంటిది ఏమి లేదని విశ్వవిద్యాలయ సిబ్బందికి రెండో డోసులు పూర్తి చేశామని వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల వ్యాధి తీవ్రత మనిషి ప్రాణాల ముప్పు దాకా రాకుండా కాపాడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్పిన అంశం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిఒక్కరు రిజిస్టర్ చేయించుకొని వ్యాక్సిన్ వేయించుకోవలసిందిగా కూర్చున్నాము.ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న NSS కోఆర్డినటర్ ఉదయ్ శంకర్ అల్లం గారకి NSS సిబ్బందికి,వాలంటీర్ల అందరికి కూడా  మరియు డాక్టర్ శంకరయ్య గారికి  ఎన్ని ధన్యవాదాలు చెప్పిన తక్కువేనని వారికి ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం తరుపున ధన్యవాదాలు తెలిపారు.డా శంకర్ గారు మాట్లాడుతూ రెండో విడత కో వ్యాక్సిన్ సింహపురి యూనివర్సిటీ లో ఇస్తున్నాము కొవ్యాక్సిన్ ప్రతిఒక్కరికి ముఖ్యంగా 45 సంవత్సరాలు పైబడిన వారిని గుర్తించి పేరు పేరున వయస్సుతో రికార్డ్ చెసుకొని 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ రెండో విడత కొవ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది మొదటి సారి ఇచ్చినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితి రాలేదు.కొవ్యాక్సిన్ సెషన్ లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మాకు సహకరించినటువంటి జిల్లా వైద్య అధికారి డాక్టర్ మల్లికార్జున్ గారికి అదేవిధంగా DEO గారికి మరియు ప్రొగ్రాం ఆఫీసర్ గారికి మా తోటి పనిచేసిన HEO ఓ శ్రీనివాసులు గారికి మెడికల్ అఫిసర్ దగ్గరుండి అన్నీ సహకరించారు విజయవంతంగా కొవ్యాక్సిన్ వేయగలిగామని ధన్యవాదాలు తెలిపారు.రెక్టార్ ఆచార్య ఎం చంద్రయ్య గారు కసుమురు వైద్య బృందానికి,డా శంకర్ గారికి NSS సమన్వయకర్త డా ఉదయ్ శంకర్ అల్లం గారికి ఇలాంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న NSS సిబ్బందికి మరియు వాలంటేర్లకీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు .ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ జాతీయ సేవ పథకం సమన్వయకర్త డా ఉదయ్ శంకర్ అల్లం గారు మాట్లాడుతూ ప్రజలు వ్యాక్సిన్ పట్ల ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా  కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా వైద్య నిపుణులు చెప్పిన విధంగా కోవిడ్ 19 యొక్క సింటమ్స్ ఉన్నాయని అనిపించినా వైద్య నిపుణుల సలాహ కచ్చితంగా తీసుకోవాలని అదేవిధంగా జన సంచారం ఉన్న చోట భౌతిక దూరాన్ని పాట్టిస్తు మస్కులను మరియు శానీటైజర్లను ఉపయోగించాలని తెలిపారు.విశ్వవిద్యాలయానికి మరియు ప్రజలకు ఎల్లపుడు సహాయం చేసేవిధంగా జాతీయ సేవ పథకం(NSS)ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజ ఎస్ నాయర్ గారు ,సహాయక రిజిస్ట్రార్ డా సుజయ్ కుమార్ ,పరీక్షల నియంత్రణాధికారి డా సాయి ప్రసాద్ రెడ్డి గారు ,బోధన బోధనేతర సిబ్బంది మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post