కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆనందయ్య మందు ఎంతోమందిలో ఆశలు కల్పించిందనడంలో సందేహంలేదు. అయితే, ఈ మందుపై శాస్త్రీయ అధ్యయనం అవసరమంటూ పంపిణీని కొన్నిరోజుల పాటు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం... ఎట్టకేలకు అనుమతి మంజూరు చేసింది. సీసీఏఆర్ఎస్ (జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ) కమిటీ ఇచ్చిన నివేదికను పూర్తిగా పరిశీలించిన ప్రభుత్వం ఆనందయ్య మందు పంపిణీకి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది.
అయితే, ఆనందయ్య కుటుంబీకులు కంట్లో వేస్తున్న మందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీనిపై కమిటీ నుంచి నివేదిక రావాల్సి ఉందని, నివేదిక పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనికి మరికొంత సమయం పడుతుందని వెల్లడించింది
Post a Comment