పర్మిషన్ ల పేరు తో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు: సిపిఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి



 కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి - రేణికుంట రెండు గ్రామాల మధ్యలో గలమోయాతుమ్మెద  వాగులో పర్మిషన్ ల పేరుతోవందలాది ట్రాక్టర్లతోఒక్కో రోజుకు  వేల ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నరు.దీనిని వెంటనే అరికట్టాలని తిమ్మాపూర్ మండలం  మొగిలిపాలెం గ్రామంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా  కార్యదర్శి పొనగంటి కేదారి విలేకర్ల సమావేశంలో మాట్లాడడం జరిగింది మండలంలో జరిగే ఇసుక అక్రమ రవాణా అధికారుల కళ్లుగప్పే  విధంగా ఇసుకాసురులు కొత్త పంథాను ఎన్నుకున్నారు కొత్తపల్లి - రేణికుంట గ్రామాలలో ఇళ్ల ముందర ఇంటికి నాలుగు ట్రిప్పులు చొప్పున ఇసుక నింపుతున్నారు ఒకవేళ అధికారులు అడిగిన ఆ ఇంటి యజమాని తనదే అని చెప్పాలని సూచిస్తున్నారు. అలా రెండు గ్రామాలలో చాలా ఇళ్లలో ఇలాగే పోసి రాత్రికి రాత్రి లారీలలో   హైదరాబాద్ తరలిస్తున్నారు ఈ కొత్తరకం నయా దంధనూ  అధికారుల గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీనిద్వారా ఇసుక మాఫియాకు అంతులేకుండా పోయింది రెండు గ్రామాల ట్రాక్టర్ యజమానులకు పడక రోడ్ల పైకి వచ్చి రాజీవ్ రహదారి పై ట్రాక్టార్లు అడ్డుగా పెట్టి గొడవలకు దిగు తున్నారు  అయినా గాని అధికారులు స్పందించడం లేదు అలాగే ఉదయం పది తర్వాత కూడా లాక్డౌన్ ఉల్లంఘించిన అక్రమ రవాణా జరుగుతుంది జాతీయ రహదారిపై ట్రాక్టర్ల మొతలతో రోడ్లు  దద్దరిల్లుతోంది.మైనింగ్ డిపార్ట్మెంట్ అసలు ఉన్నదా లేదా అన్నట్టు ఉన్నది.రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రం చూస్తూ కళ్లు మూసుకుంటుంది.త్వరలో తిమ్మాపూర్ లో జరుగుతున్న అక్రమ రవాణా పై  సిపిఐ ఆధ్వర్యంలో  రెవెన్యూ మంత్రిని  కలుస్తాం... జిల్లా కలెక్టర్.. సిపి గారు ప్రత్యేక చొరవ చూపించి  వీరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ  తిమ్మాపూర్  మండల కార్యదర్శి కామ్రేడ్ బోయిని  తిరుపతి మండల సహాయ కార్యదర్శి సూరం  మల్లేశం, రైతు సంఘము  నాయకులు కె తిరుపతి రెడ్డి మరియు సిపిఐ నాయకులు పాల్గొనడం జరిగింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post