వ్యవసాయ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష ... జూన్ 15 నుంచి రైతుబంధు



 వ్యవసాయ  శాఖపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ధాన్యం సేకరణపై ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ధాన్యం సేకరణ తీరుపై ప్రధాని మోదీకి లేఖ రాస్తామని అన్నారు. ఎంత ధాన్యం వచ్చినా తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. జూన్ 15 నుంచి 25 వరకు రైతుబంధు సాయం అందజేస్తామని తెలిపారు. నాణ్యత లేని విత్తనాలు విక్రయించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Post a Comment

Previous Post Next Post