నెలసరి సమయంలో కరోనా టీకా తీసుకోవచ్చా? సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వదంతులు

 


దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానున్న తరుణంలో ఓ వదంతు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మహిళలు నెలసరికి ఐదు రోజుల ముందు.. ఐదు రోజుల తర్వాత టీకా వేయించుకోవద్దనే వార్త సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్య వైరల్‌గా మారింది. అయితే, ఇవన్నీ వట్టి పుకార్లేనని వీటిని నమ్మొద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని.. మహిళలు దీన్ని నమ్మొద్దని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ట్విట్టర్‌లో పేర్కొంది. ప్రభుత్వంతో పాటు పలువురు వైద్యులు, వైద్య నిపుణులు ఈ దుష్ప్రచారాన్ని కొట్టిపారేశారు.18 ఏళ్లు పైబడిన వారందరూ మే 1 తర్వాత టీకా వేయించుకునేందుకు కేంద్రం అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నెల 28 నుంచి కొవిన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవనున్నాయి. మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయినప్పటికీ.. టీకా పంపిణీ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది.  నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 29 లక్షల టీకా డోసుల పంపిణీ జరిగింది.





0/Post a Comment/Comments

Previous Post Next Post