మావోయిస్టు డిప్యూటీ కమాండర్ అరెస్ట్



 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఏప్రియల్ 23 శుక్రవారం నిషేధిత సిపిఐ మావోయిస్టు  పార్టీకి చెందిన డిప్యూటీ కమాండరును అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పి సునీల్ దత్ ఐపిఎస్ శనివారం ఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎస్పి తెలిపిన వివరాల ప్రకారం ఏప్రియల్ 23 శుక్రవారం మధ్యాహ్నం చర్ల మండలంలోని గీసరెల్లి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో చర్ల పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మద్యాహ్నం 3 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా, పోలీసులు వెంబడించి ఒక వ్యక్తిని పట్టుకున్నట్టు సునిల్ దత్ తెలిపారు. పట్టుకున్న వ్యక్తిని విచారించగా సదరు వ్యక్తి తన పేరు సోడి దేవ(24), గొడ్డలిగూడ గ్రామం, సుక్మా జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రం అని తెలిపినట్టు ఆయన తెలిపారు. సోడి దేవా 2011 నుండి ఇప్పటి వరకు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో సుక్మా మరియు కాంఖీర్ జిల్లాలో పనిచేసినట్లు, ప్రస్తుతం  మావోయిస్ట్ పార్టీ 5 కంపెనీ 2 ప్లాటూన్ డిప్యూటీ సెక్షన్ కమాండరుగా పనిచేస్తునట్లు విచారణలో తెలిసినట్టు సునిల్ దత్ తెలిపారు. దేవ నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పని చేస్తూ 2015-20 మధ్య కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్, కొండగావ్, సుక్మా  జిల్లాల్లో వివిధ పోలిస్తేషన్ల పరిధిలో జరిగిన ఏడు ఘటనలలో పాల్గొన్నట్లు ఎస్పి సునిల్ దత్ ఐపిఎస్ తెలిపారు.    పట్టుబడిన వ్యక్తి వద్ద నుండి 5 డిటోనేటర్లు, 20 జిలేటిన్ స్టిక్స్, 200 మీటర్ల కార్డెక్స్ వైరును స్వాధీనం చేసుకొన్నట్లు, కేసు నమోదు చేసి కోర్టుకి అప్పగించనున్నట్లు ఎస్పి తెలిపారు.



0/Post a Comment/Comments

Previous Post Next Post