ఛత్తీస్‌గఢ్‌లో మావోలు రెచ్చిపోతున్నారు. బీజాపూర్ జిల్లాలో కిడ్నాప్ చేసిన ఎస్‌ఐ తాటి మురళిని కాల్చి చంపారు.అనంతరం ఆయన మృతదేహాన్ని పుల్సుమ్‌పారా వద్ద పడేసి వెళ్లారు. గంగలూర్‌లో పని చేస్తున్న మురళి సెలవులో ఉండగా బీజాపూర్ జిల్లాలోని తన గ్రామం పల్నూర్‌లో గత బుధవారం అపహరణకు గురయ్యాడు.కుటుంబ సభ్యులు ఆయన విడుదల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post a Comment