డా. బి ఆర్ అంబేద్కర్ 130 వ జయంతి సందర్భముగా రన్ ఫర్ ఈక్వాలిటీ మెగా రాలీ



  •  విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం 

నెల్లూరు జిల్లా: భారతరత్న డా. బి ఆర్ అంబేద్కర్  130 వ జయంతి సందర్భముగా రన్  ఫర్  ఈక్వాలిటీ  అనే  అంశము మీద వెంకటాచలం లో వి ఎస్ యు జాతీయ సేవా పధకం ఆధ్వర్యం లో  మెగా రాలీ ని నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారు ముఖ్య అతిధిగా, రెక్టార్ ఆచార్య యం చంద్రయ్య గారు మరియు  రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి గారు విశిష్ట అతిధులుగా పాల్గొని  ర్యాలీ ని ప్రారంభించారు.  ఈ సందర్భముగా ఉపకులపతి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత విద్యావేత్త , ఆర్ధిక శాస్త్రవేత్త లా పట్టభద్రుడు భారత రత్న డా. బి ఆర్ అంబేద్కర్ 130 వ జయంతి ఉత్సవాలను వారం రోజుల పాటుగా అనేక రకాల కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు.  అందులో భాగంగా   రన్  ఫర్  ఈక్వాలిటీ  అనే  అంశము ఈ మెగా ర్యాలీ ను నిర్వహించటం జరిగిందని అన్నారు.  అంబేద్కరే ఈ నాటి యువతకు స్ఫూర్తిదాయకం , అయన జీవిత చరిత్రకు  సంబందించిన పుస్తకాలను తప్పని సరిగా చదావాలని కోరారు. ఒక సామాన్య దళిత కుటుంబం నుంచి దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడిగా ఎదగడం అభినందనీయమని. ప్రపంచం లో అత్యున్నత మైన రాజ్యాంగంగా నిలబడం అయన చేసిన విశేషమైన కృషి ఉందని అన్నారు. ఆనాటి స్వాతంత్య్ర సమరయోధులందరు ఆయనను అభిమానించే వారని తెలిపారు. ర్యాలీ లో పాల్గొన్న ప్రతి ఒక్క యెన్ ఎస్ ఎస్ వాలంటీరును అలాగే కళాశాల వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని అన్నారు.   రెక్టార్ ఆచార్య యం  చంద్రయ్య  గారు మాట్లాడుతూ డా. బి ఆర్ అంబేద్కర్  రచనలు మరియు ప్రసంగాలు ఆదర్శప్రాయమని , యువత ఖచ్చితముగా అయన సూచించిన మార్గములో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యెన్ ఎస్ ఎస్ సమన్వయ కర్త  మరియు కన్వీనర్ డా. ఉదయ్ శంకర్ అల్లం, స్కిల్ దేవేలోపెమేంట్ సెంటర్ కోఆర్డినేటర్ డా. సి ఎచ్  విజయ , IQAC  కోఆర్డినేటర్ డా. సి కిరణ్మయి,  స్వాతి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, డా. సి ఎచ్ సునీల్ రెడ్డి, యెన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారులు  డా. సురేంద్ర కుమార్ , 

అంటరానితనాన్ని నిర్మూలించటం గురించి సమానత్వం గురించి మరియు అంబేద్కర్ గారి మీద  అనేక నినాదాలతో  ర్యాలీ  ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సర్వేపల్లి జంక్షన్ దాకా కొనసాగింది.  ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల , స్వాతి డిగ్రీ కాలేజీ  మరియు వి ఎస్ యు కళాశాల  యెన్ ఎస్ ఎస్ వాలంటీర్లు  కోవిద్ నియమాలను పాటిస్తూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


                                    ఇలా తినిపిస్తే మీ పిల్లలకు జీవితంలో షుగర్ రాదు 






0/Post a Comment/Comments

Previous Post Next Post