రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీస్ వాహనాల పాత బ్యాటరీలు ,పాత టైర్ లు, ఉపయోగించిన ఇంజన్ ఆయిల్ బ్యారల్స్, స్క్రాప్ స్పెర్ పార్ట్స్ లాట్స్ ని తేదీ :24-03-2021 ఈ రోజున రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో అడిషనల్ డీసీపీ ఏఆర్ కమాండెంట్ గారి ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది.ఈ అవకాశాన్ని సద్వినియోగం రెండు జిల్లాలకు చెందిన ఆసక్తి కలిగిన కొంతమంది బహిరంగ వేలం లో పాల్గొన్నారు.ఈ పాత బహిరంగ వేలం ద్వారా 1,87,400 రూపాయల ఆదాయం రావడం జరిగింది. దీనిని పోలీస్ శాఖ సంబందించిన ప్రభుత్వం ఖాతా లో జమ చేయడం జరుగుతుంది అని అడిషనల్ డీసీపీ ఏఆర్ కమాండెంట్ సంజీవ్ గారు ఒక ప్రకటన లో తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీపీ ఏఆర్ సుందర్ రావు, ఆర్ఐ లు మధుకర్, అంజన్న పాల్గొన్నారు
Post a Comment