తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. టీటీవీ దినకరన్ కు చెందిన ఏఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈరోజు చెన్నైలో ఆయన మాట్లాడుతూ, అన్నాడీఎంకే పార్టీపై మండిపడ్డారు. ప్రధాని మోదీకి బానిస పార్టీగా అన్నాడీఎంకే మారిందని విమర్శించారు. ఆ పార్టీ ఇకపై ఎంతమాత్రం జయలలిత పార్టీ కాదని చెప్పారు. మతతత్వ పార్టీ అని తెలిసి కూడా బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుందని దుయ్యబట్టారు.బాబ్రీ మసీదును ఎంఐఎం పార్టీ త్యాగం చేసిందని మహారాష్ట్ర అసెంబ్లీలో సీఎం ఉద్ధవ్ థాకరే ప్రశంసించారని... దీనికి తామెంతో గర్విస్తున్నామని ఒవైసీ అన్నారు. బీజేపీకి బీ-టీమ్ అంటూ తనను, దినకరన్ ను డీఎంకే విమర్శిస్తోందని... సెక్యులరిజం అంటే ఏమిటో డీఎంకేకు తెలుసా? అని ప్రశ్నించారు. తమిళనాడులో మూడు నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది.
Post a Comment