జలాశయలు వున్నా నీళ్లు లేక పంట పొలాలు ఎండుతూన్నా పట్టించుకోని తెరాస ప్రభుత్వం : బిజెపి



 రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట  మండలంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో పత్రిక విలేకరుల సమావేశంలో బెంద్రం తిరుపతి రెడ్డి మండల అధ్యక్షులు మాట్లాడుతూ.. ఇల్లంతకుంట మండలం లో  మిడ్ మానేరు, అనంతగిరి  అన్నపూర్ణ రిజర్వాయర్, రెండు జలాశయాలు ఉన్నా ఇల్లంతకుంట మండలానికి మాత్రం నీళ్లు వదలరు మంత్రి హరీష్ రావు  తన సిద్దిపేట  స్వంత నియోజకవర్గంలోనీ  125  గ్రామాలలో చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్లు నింపుకొని ప్రతి ఎకరాకు నీరు కాలువల ద్వారా ఇడుస్తుంటే అక్కడ మన నీళ్లలో వాళ్ళు సంబరాలు జరుపుకుంటుంటే, మన ఇల్లంతకుంట మండల రైతులకేమో  కన్నీళ్లు వస్తున్నాయి  పంటలు ఎండిపోయిన పట్టించుకోని మన  మండల TRS  ప్రజా ప్రతినిధులు  ఇంకనైనా మీరు మారారా మీకు ఇల్లంతకుంట మండల ప్రజలే ఓట్లు వేయలేదా,  మిమ్మల్ని గెలిపించింది సిద్దిపేట  హరీష్ రావు నే చెప్పండి మరి మీకెందుకు ఇంత భయం ఈ దొరలు అంటే  మండలంలోని  తెరాస ప్రజాప్రతినిధులు  నీళ్లు ఇడిపించకుండా మౌనంగా ఉండీ  రైతులను  మోసం చేయాలనుకుంటే మిమ్మల్ని కూడా  ఈ రైతులు మీ రాజకీయ జీవితానికిబొంద  పెడ్తారు మర్చిపోకండి, మన నీళ్లు మనం అడిగడానికి కూడా భయపడేలా  మన నీళ్లను దొంగలాగా ఎత్తుకెళ్తున్న వాళ్ళు భయపడాలి మీరెందుకు  బయపడుతున్నారు TRS ప్రజా ప్రతినిధుల్లారా  మీరు వెంటనే నోరు విప్పి  హరీష్ రావు వద్దకు వెళ్లి నీళ్లు విడవమంటారో, లేక  మన నీళ్లు మనకు అనే నినాదాన్ని నిలబెట్టి ఆ దొర వచ్చి మిమ్మల్ని కొన్ని  నీళ్లు ఇవ్వండి అని ఆడుకునేలా చేస్తారో ప్రజలు వేచి చూస్తావున్నారన్నారు.ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు అనగోని అవినాష్, పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రవణ్,ఓబీసీ మోర్చా  ఉపాధ్యక్షులు గాంగం అనిల్, యువమోర్చ పున్ని ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post