కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన జాగిరి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తూ ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ కాంగ్రెస్ నాయకులను దూషించినట్లు ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపెళ్లి సత్యనారాయణ కు ఫిర్యాదు చేశారు, నాయకుడిపై విచారణ చేపట్టగా అది నిజమని నిర్ధారణ అయినట్లు తెలిసింది ఈ విషయంలో పద్ధతి మార్చుకోవాలని పార్టీ అధిష్టానం సూచించినప్పటికీ జాగిరి శ్రీనివాస్ గౌడ్ అధిష్టానం యొక్క సూచనలను బేఖాతరు చేసి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని వచ్చిన ఫిర్యాదు మేరకు జాగిరి శ్రీనివాస్ గౌడ్ ను ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అతన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ నుండి తొలగించడం జరిగిందని ఈరోజు నుండి జాగిరి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి కి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
Post a Comment