కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో. బహుజనుల రాజ్యాధికారం సంకల్ప సభ కరపత్రాన్ని BSP పార్టీ జిల్లా కార్యదర్శి కల్లేపల్లి భూమన్న మరియు మండల కన్వీనర్లు కల్లేపల్లి సంతోష్& అమ్మి గల్ల సుధాకర్ ఆవిష్కరించారు.అనంతరం జిల్లా కార్యదర్శి భూమన్న మాట్లాడుతూ.. ఈ బహిరంగ సభను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు. బహుజనుల రాజ్యాధికారం సంకల్ప సభను విజయవంతం చేయడం కోసం.ప్రతి ఒక్కరూ రాగలరు అని కోరుతూ..ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల వర్గాల పై జరుగుతున్న దాడులు రూపుమాపడం కోసం ప్రమాదంలో ఉన్న రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ఏదైనా పార్టీ ఉందా అంటే అది ఒక BSP పార్టీ అని గుర్తు చేశారు.ఈ రాజ్యాంగ సంకల్ప సభ ను విజయవంతం చేయడం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు..
ఈ కార్యక్రమంలో అనిల్. పవన్. ఆంజనేయులు. మధు. సాయిలు. మరియు BSP పార్టీ కార్యకర్తలు అంబేద్కర్ వాదులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Post a Comment