వి.ఎస్ . యు లో ముగిసిన సుసంపన్న వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు



నెల్లూరు జిల్లా: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సోషల్ విభాగం ఆధ్వర్యంలో నైపుణ్యాలపై జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యూనివర్సిటీ రెక్టార్ శ్రీ ఆచార్య చంద్రయ్య గారు మాట్లాడుతూ ఇలాంటి శిక్షణ తరగతులను వినియోగించుకుని తద్వారా సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థు లు తయారవ్వాలని తెలియజేశారు . విశిష్ట అతిథిగా విచ్చేసిన ఐటిడిఎ పిఓ శ్రీ మణి కుమార్ గారు మాట్లాడుతూ వృత్తిపరమైన నైపుణ్యాలను కలిగి ఉండటం చాలా అవసరమని విద్యతోపాటు సాంకేతికపరమైన అంశాల పట్ల నైపుణ్యం సాధించలేకపోతే అభివృద్ధి సాడించలేము అని తెలిపారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విజయ్ కృష్ణ రెడ్డి గారు మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యాలను విద్యార్థుల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ నాటి శిక్షణ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నుంచి హాజరైన హాజరైన ఆచార్య నరసింహారావు గారు విద్యార్థులకు రైటింగ్ స్కిల్స్ పై తర్పిదు ఇవ్వడం జరిగింది అలాగే అపోలో మెడికల్ కాలేజ్ చిత్తూరు నుంచి హాజరైన డాక్టర్ మహేంద్ర  చౌదరి విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ మీద తర్ఫీదు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ కే సునీత గారు సోషల్ వర్క్ విభాగంఅధ్యాపకులు డాక్టర్ సుబ్బరాజు గారు అలాగే కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ సునీత గారు కార్యక్రమ. కో కోఆర్డినేటరు డాక్టర్ బి . వి. సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post