ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: మండల యువ మోర్చా అధ్యక్షులు కూన మహేష్

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల యువ మోర్చా  అధ్యక్షులు కూన మహేష్ ఆధ్వర్యంలో  తహసిల్దార్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది   గన్నేరువరం బీజేవైఎం మండల అధ్యక్షులు కూన మహేష్ మాట్లాడూతూ 

ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నిరుద్యోగులను ప్రైవేట్ ఉపాధ్యాయులను నిర్లక్ష్యం చేస్తూ వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు, ఎన్నికల ముందు లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చే ఆరు సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు సగం ఉద్యోగాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదని అన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి ప్రైవేటు ఉద్యోగులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ,  

రాష్ట్రం లో ఖాళీ గా ఉన్న ఉద్యోగాల భర్తీకై ఉద్యోగ ప్రకటన వెంటనే విడుదల చేయాలన్నారు, సీఎం కేసిఆర్ ప్రకటించినట్టు రెండవ సారి అధికారం లోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రం లో ఉన్న నిరుద్యోగులకు తక్షణం నిరుద్యోగ భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో  హరికాంతం అనిల్ రెడ్డి ఉపాధ్యక్షు కున సతీష్ కూన వెంకటేష్ యువ మోర్చా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post