జాతీయ సేవా పథకం సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం కు యూత్ ఐకాన్ అవార్డు-2021



నెల్లూరు జిల్లా: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం సమన్వయ కర్త  డా. ఉదయ్ శంకర్ అల్లం కు  2021 కు గాను  యూత్ ఐకాన్ అవార్డు   వరించింది. ఈ అవార్డు ను  నేషనల్ హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ మరియు విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ వారు సంయుక్తముగా నిర్వహించిన యూత్ ఐకాన్ అవార్డు కార్యక్రమంలో విచ్చేసిన  ముఖ్య అతిథి నేషనల్ హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ , న్యూ ఢిల్లీ  చైర్మన్  డా. సి హెచ్ గుంజన్ మెహతా గారి చేతుల  మీదుగా అందుకున్నారు, కరోనా సమయం లో సమన్వయ కర్త అందించిన సేవలకు గాను ఈ అవార్డు ను బహుకరించారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యం చంద్రయ్య గారు, రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి గారు, ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్  నాయర్ మరియు పలువురు అధ్యాపకులు డా. ఉదయ్ ను అభినందించారు  ఈ అవార్డు కు ఎంపిక చేసినందుకు గాను జ్యూరీ సబ్యులకు, నేషనల్ హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ వారికి మరియు విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్  చైర్మన్ శ్రీమతి తళ్లూరి  సువర్ణ కుమారి గారు, నెహ్రు యువకేంద్ర యూత్ ఆఫీసర్ డా. ఆకుల మహేంద్ర రెడ్డి, యన్ సి సి నేవల్  అధికారి   శ్రీ నరేంద్ర బాబు గారు మరియు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఆయుర్వేద వైద్యనిపుణులు యూత్ ఐకాన్ 2021 అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post