గన్నేరువరం లో సెల్ టవర్ ఎక్కిన జంగపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఆత్మహత్యాయత్నం

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఆదివారం జంగపల్లి గ్రామానికి చెందిన  ప్రశాంత్ అనే వ్యక్తి మండల కేంద్రంలోని సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు వివరాల్లోకి వెళితే మహారాష్ట్రకు చెందిన అమ్మాయి జంగపల్లి గ్రామానికి చెందిన అబ్బాయితో గత కొన్ని రోజులుగా వీరిద్దరూ  ప్రేమించుకున్నారు ఈ విషయం పెద్దలకు తెలియడంతో ప్రేమికులు గన్నేరువరం పోలీస్ స్టేషన్  ఎస్సై ఆవుల తిరుపతి ని కలిశారు ఇరువర్గాల కుటుంబ సభ్యులకు రప్పించి కౌన్సిలింగ్ ఇచ్చారు కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ అబ్బాయి ఒప్పుకోకపోవడంతో తనతోనే అమ్మాయిని పంపించాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని మండల కేంద్రంలోని రిలయన్స్ సెల్ టవర్ ఎక్కాడు దాదాపు మూడున్నర నాలుగు గంటల సమయం వరకు సెల్ టవర్ పైనే హల్ చల్ చేశాడు విషయం తెలుసుకున్న ఎస్సై ఆవుల తిరుపతి సంఘటన స్థలానికి చేరుకొని నచ్చజెప్పి కిందికి దింపారు అనంతరం పోలీస్ స్టేషన్ కు అబ్బాయిని తరలించి కౌన్సిలింగ్ నిర్వహించి ఇంటికి పంపారు

0/Post a Comment/Comments

Previous Post Next Post