పెట్రోల్ పంపు పనులు వేగవంతం - ప్రాథమిక వ్యవసాయ సంఘం సొసైటీ చైర్మన్ అల్వాల కోటి



 కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న పెట్రోల్ పంప్ పనులు వేగంగా జరుగుతున్నాయని సొసైటీ చైర్మన్ అల్వాల కోటి తెలిపారు శుక్రవారం స్థానిక సర్పంచి రావుల రమేష్, డైరెక్టర్ పచ్చిక రవీందర్ రెడ్డి, సీఈవో ఆంజనేయులుతో కలిసి పంప్ లో జరుగుతున్న విద్యుద్దీకరణ  పనులను పరిశీలించారు. పనులను వెంటనే పూర్తి చేసి ఫిబ్రవరి మొదటి వారంలో పెట్రోల్ పంపు ప్రారంభించు కునేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నిధుల లేమితో పెట్రోల్ పంప్ పనులు కొంత ఆలస్యం అయినప్పటికీ సహకార బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు సహకారంతో నాబార్డు నిధులను మంజూరు చేయించి,  పనుల్లో వేగం పెంచామని చెప్పారు.నిధుల మంజూరుకు సహకరించిన కొండూరికి ఆయన  ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post