డా బి ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలి బిజెపి నాయకులు మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ కొర్రపాటి డిమాండ్

 


పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేడ్కర్ గారి విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన దుండగులను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని బిజెపి నాయకులు మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ కొర్రపాటి సురేష్ డిమాండ్ చేశారు.అంబేడ్కర్ గారికి చెప్పుల దండ వేయడమంటే 130 కోట్లమంది ప్రజల భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య ప్రతిరూపాన్ని అవమానించడమేనని.ప్రపంచ దేశాలలో అంబేడ్కర్ గారిని గౌరవిస్తుంటే ఆయన జన్మించిన మనదేశంలో మాత్రం  ఆయన విగ్రహాలను అవమానిస్తూ నిమ్న కులాలలపై ఇంకా వివక్షతలు చూపుతూనే ఉన్నారని.దుండగులను కఠినంగా శిక్షించి మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కొర్రపాటి సురేష్ డిమాండ్ చేశారు

Post a Comment

Previous Post Next Post