ఆర్టీసీ ఎండీగా మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, స్టోర్స్ విభాగంలో కమిషనర్ గా పని చేస్తున్న ఠాకూర్ ను ఆర్టీసీ వీసీ ఎండీగా బదిలీ చేస్తున్నట్టు చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రవాణా, రహదారులు భవనాల శాఖలో ఆయన సేవలను వినియోగించుకునేందుకు బదిలీ చేసినట్టు తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్ గా కూడా ఆయన బాధ్యతలను నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీగా నియమితులైన సందర్భంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను ఆర్పీ ఠాకూర్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ఈ బాధ్యతలను అప్పగించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
Post a Comment