2018 నాటి కేసులో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు నిన్న చెన్నై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేయడం తెలిసిందే. బెంగళూరు నుంచి చెన్నై వచ్చిన ఆయనను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీ పోలీసులకు అప్పగించారు.ఈ ఘటనపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. బీటెక్ రవి ఓ ఎమ్మెల్సీ అని, చట్టసభ్యుడు అని తెలిపారు. అలాంటి వ్యక్తిని ఎప్పటిదో పాత కేసులో ఓ అంతర్జాతీయ నేరస్తుడిలా ఎయిర్ పోర్టు రన్ వేపై అరెస్ట్ చేస్తారా? అంటూ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. పైగా అది అందరికీ బెయిల్ వచ్చిన కేసు అని సోమిరెడ్డి వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యల మీద పెట్టిన దృష్టి ప్రజల బాగోగులపై పెడితే రాష్ట్రమన్నా బాగుపడుతుందని హితవు పలికారు.
Post a Comment