ఎలుగుబంటి ని హతమార్చిన గుర్తు తెలియని వేటగాళ్లు - సంఘటనా స్థలానికి పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని  మైలారం గ్రామ శివారు లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ సమీపంలో గురువారం అడివి పంది ఉచ్చులో ఎలుగుబంటి బలైన విషయం తెలిసిందే ఎలుగుబంటిని గుర్తుతెలియని వేటగాళ్లు ఎలుగుబంటి యొక్క గోళ్లు, తల కింద దవడ దంతాలు, కోసుకొని వెళ్లారు  గుట్ట సమీపంలో గొర్రెల కాపరులు మృతి చెందిన ఎలుగుబంటి శరీరాన్ని చూసి గ్రామ సర్పంచ్ దొడ్డు రేణుక కు సమాచారం ఇవ్వడంతో  శుక్రవారం  అధికారులకు తెలపడంతో  అటవీశాఖ అధికారులు FRO గంటల శ్రీనివాస్ రెడ్డి,DY.R.O. కె.చైతన్య ఆనంద్,FBO వి సుజాత రెడ్డి లు  సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు ఎలుగుబంటి ని పోస్టుమార్టం నిర్వహించి పూడ్చిపెట్టారు ఎలుగుబంటి ని హతమార్చిన గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకుని శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు అలాగే అడవి పందులను సైతం అదే గుట్ట సమీపములో హతమార్చి వాటి మాంసం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు కోరుతున్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post