ఫోన్ చేయాలనుకుంటే సున్నా నంబర్ తప్పనిసరి : టెలికాం విభాగం

 


ల్యాండ్‌లైన్‌ నుంచి ఏ మొబైల్ ఫోన్ కు డ‌య‌ల్ చేసినా ఆ నంబ‌రుకు ముందు సున్నా కూడా చేర్చాల్సి ఉంటుంది. ఈ మేర‌కు టెలికాం విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఇక‌పై సున్నా నంబ‌రును త‌ప్ప‌నిస‌రి చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేసింది.నిన్నటి నుంచే టెలికాం విభాగ ఆదేశాలు అమ‌ల్లోకి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ల్యాండ్‌లైన్‌ వినియోగదారులకు టెలికాం కంపెనీలు ఈ సమాచారం అందిస్తున్నాయి. ఈ విష‌యాన్ని త‌మ వినియోగ‌దారుల‌కు ప్ర‌ముఖ టెలికాం సంస్థ‌లు ఎయిర్‌టెల్‌,  రిలయన్స్‌ జియో మెసేజ్ లు, ఇత‌ర రూపాల్లో తెలుపుతున్నాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post