బాలికల వసతి గృహంలో పండ్ల మొక్కలు నాటిన వి.ఎస్.యు ఉపకులపతి



నెల్లూరు జిల్లా: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం నందు బాలికల వసతిగృహంలో ఈ రోజు విశ్వవిద్యాలయ ఉపకులపతి రొక్కం సుదర్శన రావు గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి వసతి గృహ పరిసరాల్లో పండ్ల మొక్కలను నాటారు.వసతి గృహంలో ఉండే బాలికలకు మంచి పోషకాహారాన్ని అందించే దానిలో భాగంగా ఆరోగ్యాన్ని పెంపొందించే పండ్ల మొక్కలను నాటాలని తద్వారా బాలికలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలమని ఆ సంకల్పంతోనే పండ్ల మొక్కలను నాటించాలని వసతి గృహంలో అధికారులకు ఆదేశాలు ఇవ్వడం తో నేడు కార్యక్రమంలో మేలు జాతికి చెందిన అరటి,బొప్పాయి పండ్ల చెట్లను విశ్వవిద్యాలయ ఉపకులపతి రొక్కం సుదర్శన రావు గారు స్వయంగా నాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణ రెడ్డి, పాల్గొని కొన్ని మొక్కలను నాటారు.అనంతరం ఉపకులపతి సుదర్శన రావు గారు మాట్లాడుతూ వసతి గృహ పరిసరాల్లో ఇలాంటి చెట్లను నాటడం  ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటుగా ,మంచి ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోగలమని చెప్తూ వసతి గృహ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలికల వసతిగృహ వార్డెన్ డా ఆర్.మధుమతి,C.D.C డీన్ విజయానంద బాబు గారు, NSS సమన్వయకర్త డా.ఉదయ్ శంకర్ అల్లం, ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్ గారు, పరీక్షలనిర్వాహణాధికారి డా సి.యస్.సాయిప్రసాద్ రెడ్డి,  డా హనుమ రెడ్డి, డా మేరిసంధిప, మరియు డా సాయినాథ్, ఎన్ యస్ యస్ సిబ్బంది ,అధ్యాపక అద్యపకేతర సిబ్బంది వసతిగృహ బాలికలు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post