నెల్లూరు జిల్లా: నివర్ తుఫాను వలన నిరాశ్రయులై నిరుత్సహంతో కొట్టుమిట్టాడుతున్న గిరిజన వాసులకు మేమున్నాము అంటూ ముందుకు వచ్చారు వి ఎస్ యు ఎన్ ఎన్ ఎస్ హెల్ప్ ది నీడి టీం. నగర శివారులలో వేంకటేశ్వరపురం లోని పెన్నా నది ఒడ్డున నివాసముంటున్న కుటుంబాలు సైక్లోన్ నివర్ వలన పూర్తిగా నిరాశ్రుయులైనారు . వి ఎస్ యు ఎన్ ఎన్ ఎస్ హెల్ప్ ది నీడి టీం వాలంటీర్స్ సర్వే చేసి బాధిత కుటుంబాలను గుర్తించారు. వారికి దుప్పట్లను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారి చేతుల మీదుగా బాధితులకు అందచేశారు. ముందుగా ఉపకులపతి పెన్నా నది ఒడ్డున నివసిస్తున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి వారి సాధకబాదలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు వారి బాధలను కష్టాలను అలాగే జరిగిన నష్టమును ఉపకులపతి గారికి తెలియచేసారు ఈ సందర్భముగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారు మాట్లాడుతూ, సాంఘిక మరియు సామాజిక బాధ్యతగా విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నదని అన్నారు. నివర్ ఉధృతంగా ఉన్నసమయంలో మీరందరు ఎన్ని బాధలు పడ్డారో తాము వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా చూసి తామంతా ఎంతో కలత చెందామని అన్నారు. తాము స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి, ఈ మంచి పని చేస్తున్నామని అన్నారు. నివర్ విపత్కర సమయంలో ప్రభుత్వం మరియు జిల్లా అధికార యంత్రామ్గము ఎంతో చాకచక్యం గ వ్యవరించి అధిక నష్టం జరగకాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని అందుకు ప్రభుత్వాన్ని అలాగే జిల్లా అధికార యంత్రామ్గమును ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. విశ్వవిద్యాలయం లోని అధ్యాపక బృందానికి ఎంతో సామాజిక బాధ్యత ఉందని అన్నారు . అందుకు వారందరిని మరియు హెల్ప్ ది నీడి టీంను అభినందించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్, అధ్యాపకులు డా. కె. సునీత, డా. ఆర్. మధుమతి, డా. కిరణ్మయి, ఎన్ ఎన్ ఎస్ సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, హెల్ప్ ది నీడి టీం సభ్యులు, పార్ధసారధి, చైతన్య, హేమంత్ సింగ్, రాజేష్, కావ్య, కీర్తన, చంద్రిక, గీతికా సూర్య తేజ క్రాంతి, ప్రేమ్, లోకేష్ మరియు నాజర్ పాల్గొన్నారు
Post a Comment