‘సలాం’ కేసులో సీఐ - హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్

 


కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా.. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిపై క్రిమినల్‌ కేసు నమోదుచేశారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ఘటనకు బాధ్యులైన సీఐ, హెచ్‌సీలను అరెస్టు చేసినట్టు హోంశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, దొంగతనం చేయకపోయినా పోలీసులు వేధిస్తున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నామంటూ సలాం కుటుంబం తీసుకున్న సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది.ఐజీ శంకబ్రత బాగ్చి, గుంటూరు జిల్లా అడిషనల్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌లతో ప్రాథమిక విచారణ చేయించింది. వీరు సేకరించిన సాక్ష్యాల ఆధారంగా సీఐ, హెచ్‌సీలను ఆదివారం అరెస్టు చేశారు. కాగా, సమగ్ర దర్యాప్తు చేయాలన్న సీఎం ఆదేశాలతో శంకభత్ర బాగ్చీ నేతృత్వంలో రాయలసీమ రేంజ్‌ డీఐజీ వెంకటరామిరెడ్డి, ఆరిఫ్‌ హఫీజ్‌, ట్రైనీ ఐపీఎస్‌ ప్రతా్‌పకిశోర్‌, ఎస్‌ఈబీ ఏఎస్పీ గౌతమి శాలినితో హోం శాఖ సిట్‌ ఏర్పాటు చేసింది. ఈ బృందం ఆదివారం నంద్యాలకు చేరుకుని పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించింది. ఇదిలావుంటే, తప్పు చేసిన వారు ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post