కేసీఆర్ కు నిరుద్యోగుల పై పెరిగిన ప్రేమ - మోడీకి కేసీఆర్ లేఖ

 


నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని, ఆ పరీక్షలను హిందీ, ఆంగ్లంలోనే నిర్వహించడం వల్లే ప్రాంతీయ భాషలో చదువుకున్న విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పారు. దీనివల్ల ఆంగ్ల మాధ్యమంలో చదువుకోని విద్యార్థులు, హిందీయేతర రాష్ట్రాల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని చెప్పారు.దేశంలో అన్ని రాష్ట్రాల వారికీ సమాన అవకాశాలు కల్పించాలని  అన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో ఉద్యోగాలకు పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని అన్నారు. ఇందుకు ఆదేశాలు జారీ చేస్తూ యూపీఎస్సీ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, ఐబీపీఎస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు సూచనలు చేయాలని కోరారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post