ఎపి సియం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సోమవారానికి వాయిదా


 

ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తులకు సంబంధించి సీబీఐ ఛార్జ్ షీట్లపై విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. జగతి పబ్లికేషన్స్ ఛార్జ్ షీట్ లో డిశ్చార్జ్ పిటిషన్ పై ఈ రోజు వాదనలు కొనసాగాయి.మరోవైపు జగన్ పై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విచారణను వేర్వేరుగా విచారణ జరపాలనే విషయంపై రేపు విచారణ జరగనుంది. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ పై విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఇంకోవైపు గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణంపై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.మరోవైపు ... సీబీఐ, ఈడీ కేసుల విచారణను వేర్వేరుగా జరపాలని జగన్ వేసిన పిటిషన్ పై ఈడీ నిన్న కౌంటరు దాఖలు చేసింది. రెండు కేసులను కలిపే విచారించాలని అఫిడవిట్లో ఈడీ పేర్కొంది.


0/Post a Comment/Comments

Previous Post Next Post