కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి ఫంక్షన్ హాల్ లో MSP మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి జనగాం శంకర్ ఆధ్వర్యంలో MSP మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ నియోజక వర్గ స్థాయి సమావేశం కు హాజరు కావడం జరిగింది MSP మహాజన సోషలిస్టు పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ సబ్బండ జాతుల ను ఏకం చేస్తూ రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తూ ముందుకు రావాలని గౌరవ మంద కృష్ణమాదిగ సారధ్యంలో పనిచేసి అన్ని కులాలను ఏకం చేసి కృష్ణ మాదిగ గారిని సీఎం పదవి కోసం మనమందరం కృషి చేయాలని తెలియ చేశారు. MSP పార్టీ బలోపేతానికి మేము భాగస్వామ్యులు గా ఉంటామని బీసీ సామాజిక వర్గాల నాయకులు 20మంది కార్యకర్తలు పార్టీలో చేరడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ గారు, ఇల్లంతకుంట మండలం నుండి రాష్ట్ర నాయకుడు గుందేటి రాజు, బెజ్జంకి మండల MRPS ఇంఛార్జి మాంకళ ప్రవీణ్ కుమార్,గన్నెరువరం MRPS అధ్యక్షుడు దేవరాజ్,సీనియర్ నాయకులు మాతంగి జితేందర్ బీసీ నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Post a Comment