కరీంనగర్ జిల్లా : దసరా పండగను దృష్టిలో ఉంచుకుని పంటలు దెబ్బతిన్న రైతులకు తాత్కాలిక నష్టపరిహారం కింద రూ. 25వేలు వెంటనే చెల్లించాలని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరుసగా వచ్చి పడ్డ విపత్కర పరిస్థితుల నుంచి ఇంకా తేరుకోని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తమకు ఇష్టమైన బతుకమ్మ, దసరా పండుగలను సంతోషంగా చేసుకునే పరిస్థితిలో లేరని, ఈ పండుగలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పంటలు దెబ్బతిన్న రైతులకు తాత్కాలిక నష్టపరిహారంగా రూ.25వేల చొప్పున వెంటనే అందించడమే కాకుండా హైదరాబాద్ ముంపు బాధితుల కోసం పునరావాసం, సహాయక చర్యలు సత్వరమే చేపట్టి ఆదుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నదని, ప్రభుత్వం వద్ద ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే ఇలాంటి ఉపద్రవాలను ప్రభుత్వం ఎదుర్కోలేక పోయిందని విమర్శించారు. నీట మునిగిన కాలనీ ప్రజలకు తాత్కాలిక సహాయం కింద ఇస్తున్న రూ. 5వేలు ఎంతమాత్రం సరిపోవని,రూ.15వేలు అందించి ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు. ఒక వైపు కరోనా,మరో వైపు ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని, ముఖ్యంగా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు దెబ్బతినడంతో రైతులకు అపార నష్టం వాటిల్లిందని, ముఖ్యంగా భాగ్యనగర వాసులు ముంపు బాధలు వర్ణనాతీతమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కరోనా విజృంభించడం వల్ల అష్టకష్టాలు పడుతున్న రాష్ట్ర ప్రజలను భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేశాయని, ఈ బాధలను నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేక తల్లడిల్లిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని
Post a Comment